Christmas Celebrations In Telangana : రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 12 గంటలకు పలు కార్యక్రమాలు.. సామూహిక ప్రార్ధనలు చేపట్టారు. ప్రత్యేక ప్రార్ధనలతో రోజుని ప్రారంభించనున్నారు. పండగ వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు యేసు నామస్మరణతో మార్మోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.