New Year 2025 Celebrations in AP : నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ రోడ్లపై షికార్లు చేసిన కుర్రకారు క్యాలెండర్లో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీధుల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల నుంచి మొదలుకొని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతమంటూ సంబరాలు చేసుకున్నారు.