World Bank Loan For Musi Riverfront Development Project : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో ముందుడగు పడింది. ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయ అనుమతి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. రుణ ఒప్పందానికి ముందే డీపీఆర్లు సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. త్వరలోనే డీపీఆర్లు పూర్తిచేయించి కేంద్రం, ప్రపంచ బ్యాంకుకు అందించేందుకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధమవుతోంది.