CID Inquiry On Kakinada Port : వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ పోర్టు, సెజ్‌లోని రూ.3600 కోట్ల విలువైన వాటాను కారుచౌకగా కొట్టేయడానికి జగన్ అండ్ కో చేసిన దాష్టీకాలను బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్-కేఎస్పీఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్-కేఐహెచ్పీఎల్కు 41.12 శాతం వాటాతో రూ.2,15,50,905 షేర్లు ఉండేవి.