Vizianagaram Harika & Bhargavi Enormously Talented Sisters Bags Medals in Weight Lifting : ఆటల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. ఒకరిని చూసి ఇంకొకరు క్రీడల వైపు అడుగులేస్తున్నారు. అలా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ వెయిట్ లిఫ్టింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్నా వెనకడుగు వేయలేదు. కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో వెయిట్ లిఫ్టింగ్లోని నైపుణ్యాలు ఔపోసన పట్టారు. ప్రతీ టోర్నీలో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారా అక్కాచెల్లెళ్లు.