CM Chandrababu on Social Media Fake Posts: ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. హద్దు మీరు ప్రవర్తిస్తున్న వారు ఇక ఖబడ్దార్ జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తామని అన్నారు. కొవ్వు పెరిగిన వాళ్ల కొవ్వు కరిగిస్తామని దుయ్యబట్టారు. నేరస్థులకంటే సమర్థులుగా పోలీసులు పని చేయాలని అన్నారు. ఆడబిడ్డలపై అసభ్య పోస్టులు పెట్టడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఏ చట్టం చెప్తోందని సీఎం మండిపడ్డారు.