Adikavi Nannaya University Students Strike due to Food Issue : రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వసతిగృహాల్లో విద్యార్థినులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల్లో నాణ్యతలేమి, సరైన పరిశుభ్రత పాటించకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అన్నంలో పురుగులు ఉంటున్నాయని, కూరగాయలు సరిగా శుభ్రం చేయకుండా వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా డైనింగ్ హాల్ మొత్తం అధ్వానంగా ఉంటోందని వాపోయారు.