Mangalagiri Area Under Surveillance of CC Cameras : రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరిలో ప్రభుత్వం రియల్‌టైం గవర్నెన్స్ అమలు చేయడానికి సిద్ధమైంది. నేరాలు, అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు సత్వరం స్పందన కోసం ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోనుంది. దీనికోసం నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.