Home Minister Anitha Inaugurate CCTV Cameras at Jaggayyapeta : మిస్టరీ కేసులను చేధించటంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరాల్లోనే కాదు గ్రామాల్లో సైతం నేరాల కట్టడికి సీసీ కెమెరాలు వినియోగించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 509 సీసీ కెమెరాల పైలెట్ ప్రాజెక్ట్ను మంత్రి అనిత ప్రారంభించారు. రాష్ట్రానికి జగ్గయ్యపేట ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పోక్సో కేసుల్లో నిందితునిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. రెండు కన్నా ఎక్కువ పోక్సో కేసులున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని నేరగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు.