IG Ashok Kumar Said No Hidden Cameras Found in Engineering College : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలేమీ దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేశామన్నారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని చెప్పారు. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదని వెల్లడించారు.