Kadapa Police Arrested Two Persons and Recover 37 Cars : ముఖ్య నేతలు జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు స్థానిక నేతల హడావిడి చెప్పనక్కరలేదు. పదుల సంఖ్యలో వాహనాలతో తమ బలం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఇదే అదనుగా కడపకు చెందిన ఇద్దరు యువకులు వాహనదారులకు బురిడికొట్టించారు. నెలవారి అద్దె చెల్లిస్తామని చెప్పి వాహనాలు తీసుకుని వాటిని మరొకరి అమ్మి లక్షల రూపాయలు కాజేశారు. ఓ కారు యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.