Trolley Auto Theft in Peddapalli : ఇంటి ముందు నిలిపి ఉంచిన ట్రాలీ ఆటోను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆటో యజమాని రవీందర్ శనివారం రోజున ఓ పెళ్లి వేడుకకు హాజరై, ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆరోజు రాత్రి వరకు ఆటో ఇంటి బయటే ఉంది.