Police Arrested Bike Robbery Accused Gangs in Anantapur : అనంతపురం, కడప జిల్లాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిఉంచిన ద్విచక్రవాహనాలను సులువుగా దొంగలిస్తున్న రెండు ముఠాలను అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో కాచుకొని ఉండి, వాహనం నిలిపి హడావిడిగా వెళ్లేవారిని గమనిస్తూ, ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కేసులున్న ఈ గ్యాంగ్‌లో అనంతపురం భవానీ నగర్‌కు చెందిన జితేంద్ర కీలకమైన నిందితుడు. ఇతనిపై పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల దొంగలించిన ఎనిమిది కేసులు ఉన్నాయి. అనంతపురంలో కూడా జితేంద్రపై రెండు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.