Police Investigating on Penukonda Kia Engine Theft Case : కియా పరిశ్రమలో కారు ఇంజిన్ల చోరీ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్లాంట్‌లో భద్రతా లోపాలను ఆసరా చేసుకుని ఇంటి దొంగలే భారీ స్థాయిలో ఇంజిన్లను బయటకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. పరిశ్రమ నుంచి ఇంజిన్లను దారి తప్పించడం మొదలు దిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో వాటిని విక్రయించే వరకూ ఓ ముఠా కార్యకలాపాలు జరుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.