Anam Venkataramana Reddy Fire on Jagan Tirumala Tour : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి పెద్ద వ్యక్తులే అఫడవిట్ ఇచ్చినప్పుడు జగన్కు వచ్చిన ఇబ్బంది ఏంటని? ఆయన ప్రశ్నించారు. జగన్ తన రాజకీయాల కోసం అటు హిందువులను, ఇటు క్రైస్తవుల్ని మోసగిస్తున్నారని దుయ్యబట్టారు.