EX CM Jagan Tirumala Tour: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెను దుమారం రేగిన వేళ, మాజీ సీఎం జగన్ చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు.