Government To Appoint New State Election Commission Candidate : రాష్ట్రఎన్నికల కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కమిషనర్ పార్థసారధి పదవీకాలం నేటితో ముగియనుంది. ఆయణ్ను మరోఏడాది కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్నది వేచూడాలి. కొత్త కమిషనర్ నియామకానికి విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఎస్ఈసీ నియామకం కీలకం కానుంది.