Political Leaders Supporting HYDRA Demolitions : హైదరాబాద్లో వర్షం పడితే చాలు రహదారులన్నీ జలమయం అవుతాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. వందలాది చెరువులు ఆక్రమణకు గురికావడమే ఇందుకు కారణమనే భావన చాలా కాలం నుంచి ఉంది. ఈ సమస్యపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్ ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. ఐజీ రంగనాథ్ హైడ్రాకు కమిషనర్గా వ్యహరిస్తుండగా 3వేల 500ల మంది వరకు అధికారులు, సిబ్బంది కావాలని ప్రతిపాదన పంపారు.