Solvent Leakage Led to Reactor Blast at Atchutapuram Pharma : పరిశ్రమల్లో వరస ప్రమాదాలు కార్మికులు, స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. జనావాసాల మధ్య ఏర్పాటైన పరవాడ జేఎన్ ఫార్మాసిటీతో పాటు అచ్యుతాపురం సెజ్‌లో కలిపి 138 ఫార్మా పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 40 వేల మంది పని చేస్తున్నారు. మండే స్వభావం గల సంస్థల్లో అధికారులు తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడంతో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.