CM Revanth on Ring Road : రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగానికి వెంటనే భూసేకరణ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ నిర్మాణం ఉండాలన్న సీఎం ప్రతిపాదిత అలైన్మెంట్లో మార్పులు చేయాలని సూచించారు. ఆ మార్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు. పనుల పురోగతిపై కలెక్టర్లు రోజువారీ నివేదిక ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు. ప్యూచర్ సిటీపై రేవంత్రెడ్డి పలు సూచనలు చేశారు.