Vice President Jagdeep Dhankhar About Swarna Bharat Trust Services : సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్ తరాలను ప్రమాదంలో నెట్టినట్లవుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు వెంకయ్యనాయుడు అందిస్తున్న సహకారాన్ని ధన్ఖడ్ కొనియాడారు.