జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో అందరి కంటే ఎక్కువ విద్యావంతుడిగా, సమర్దుడిగా, నిబద్ధత కలిగిన మంత్రిగా మేకపాటి గౌతం రెడ్డి తెచ్చుకున్న పేరు ప్రత్యేకం. నిన్నటిదాకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో విస్తృతంగా సదస్సుల్లో పాల్గొన్నారు.2020లో ఏపీపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద భారీ వ్యూహాలేవీ లేవు. దీన్ని ఎదుర్కొనేందుకు మేకపాటి తనదైన శైలిలో దూసుకుపోయారు.జగన్ ప్రభుత్వానికి ఇమేజ్ పెంచారు.