BRS on other Regional Parties : సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యే దిశగా గులాబీదళం ప్రణాళికలు రచిస్తోంది. దేశంలో పటిష్ఠంగా ఉన్న ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనుంది. డీఎంకే, టీఎంసీ, బీజేడీ లాంటి పార్టీల విధానాలను పరిశీలించి, సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది.