Special Story On Folk Singer Jhansi : చరిత్రలో ఏ ఉద్యమాన్ని తీసుకున్నా పాటలదే ప్రధాన పాత్ర. ఉద్యమాలకు ఊపిరి పోయడంలో అవి ముఖ్య భూమిక పోషించాయి. ప్రజలను చైతన్యపరిచే అలాంటి పాటలను అవపోసన పట్టిందా యువతి. పాట ఏదైనా పల్లవి ఎంత కఠినమైనా ఇట్టే పాడేస్తూ సంగీత ప్రియుల మన్ననలు పొందుతోంది. పాటలతోపాటు, విద్య, వ్యవసాయం మూడింటినీ త్రికరణ శుద్ధితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరి, ఆ గానకోకిల గాథ గురించి మనమూ తెలుసుకుందామా