MLA Danam Nagender On GHMC Case : హైదరాబాద్ నందనగిరిహిల్స్ పార్కు ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతన్న దానం, ప్రజాప్రతినిధిగా వెళ్లిన తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు. జీహెచ్ఎంసీ పెట్టిన కేసుపై స్పందించిన దానం నాగేందర్, వాటికి భయపడేది లేదని వెల్లడించారు.