MLA Ganta Srinivasa Rao Comments: కూటమి గేట్లు తెరిస్తే వైఎస్సార్సీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లోనూ ఇదే పునరావృతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.