Mallaiah Excels in Painting: తోటి వారంతా డాక్టర్, ఇంజినీరింగ్ కోర్సులు చేసి ఉద్యోగాలు సంపాదిస్తుంటే. మీ వాడేమో బొమ్మలేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ బొమ్మలు బువ్వ పెడతాయా అంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను ఎగతాళి చేశారు బంధుమిత్రులు, గ్రామస్థులు. ఇప్పుడు ఆ బొమ్మలేసే బిడ్డే ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే వెక్కిరించిన నోళ్లే ప్రశంసిస్తున్నాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఔరా అనిపించిన ఆ యువ చిత్రకారుడి కథ ఇది.