Telangana Govt Focus ON LRS : ఎట్టకేలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారం నుంచే దరఖాస్తులను పరిశీలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉంటే 3నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం సూచించింది. ప్లాట్లను 3దశల్లో, లేఅవుట్లను 4దశల్లో క్రమబద్ధీకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.