Siddipet Govt Degree College PG New Courses : పీజీ పూర్తకాగానే, కొందరు తమ విద్యార్హతకు అనుగుణంగా ఉద్యోగాల కోసం అన్వేషిస్తారు. ఏదో ఒక చిన్న కొలువుతో సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం నైపుణ్యాలకు సానపెట్టుకోవడంపై దృష్టిపెడతారు. ఐతే, పీజీలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా, సిద్దిపేట డిగ్రీ కళాశాలకు అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీలో కొత్త కోర్సుల్ని అందుబాటులోకి తెచ్చారు.