Interesting Facts About MS Dhoni | ధోనీకి అన్నయ్య..:ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో అతనికి అన్నయ్య ఉన్నట్లు ఎక్కడా చూపించలేదు. కానీ ధోనీకి నరేంద్ర సింగ్ ధోనీ అనే అన్నయ్య ఉన్నాడు. సినిమాలో అతని పాత్ర లేకపోవడం గురించి ప్రశ్నిస్తే.. 'ఈ సినిమా ధోనీ గురించి, అతని జీవితంలో నాది అంత పెద్ద పాత్ర లేదు. అందుకే సినిమాలో నా క్యారక్టర్ లేదు. అయినా సినిమా ధోనీ గురించి కదా. నా పాత్ర లేకపోతే ఏం?' అని అన్నాడు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉండటం గమనార్హం.