PSR Anjaneyulu Remanded : ముంబయి నటిని వేధించిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు విజయవాడలోని ఏసీజేఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పీఎస్ఆర్ను మంగళవారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి దాదాపు 7గంటల పాటు ప్రశ్నించారు. మంగళవారం రాత్రంతా విజయవాడలోని సీఐడీ కార్యాలయంలోనే ఉన్న ఆయనను బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సీఐడీ కోర్టుకు తీసుకెళ్లారు.