Rammohan Naidu Says Baruva Beach to Be Tourism Hub : దశాబ్దాల చరిత్ర కలిగిన బారువ తీరంలో రెండు రోజుల పాటు తాబేళ్ల సంబరం నిర్వహించడంతో ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయనే విషయం తేటతెల్లమైంది. ప్రముఖులు ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ఇక్కడి సహజసిద్ధ అందాలు, ఇతర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కి.మీ. మేర మైదానంలా ఉన్న తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అనువుగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.