Tourists At Gunjiwada Water Falls in Alluri District : ప్రకృతి సౌదర్యం మానవుడిని పరవశింపజేస్తుంది. కొండకోనల నుంచి జాలువారే జలపాతం అందాలు మనసులను పులకరింపజేస్తాయి. ప్రకృతి అందాలను తిలకించి దాని ఒడిలో సేదతీరేందుకు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గుంజివాడ జలపాతానికి పర్యాటకులు తరలివస్తున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం జామిగూడ పంచాయతీలోని ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం హొయలు చూసి పర్యాటకులు మైమరచిపోతున్నారు.