Laknavaram : పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి మరో ఆకర్షణ తోడైంది. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విభిన్న రకాల బోట్లను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాటర్ రోలర్తోపాటు మూడు రకాల బోట్లు ఉన్నాయి. నీటిలో వాటర్ రోలర్తోపాటు తిరుగుతూ పర్యాటకులు వింత అనుభూతికి లోనవుతున్నారు.