తుర్కియే దేశంలోని పర్యటిస్తున్న దేశాల్లో భారతీయులు ముందు వరుసులో ఉన్నారని గత ఏడాది 3లక్షల30వేల మంది పర్యటించారని ఆ దేశ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ యల్మాన్ ఓకాన్ , సంస్కృతి పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోజెట్ అన్నారు. ఈ ఏడాది 4లక్షల భారతీయ పర్యాటకులు పర్యటిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ రెండో ఎడిషన్‌లో భాగంగా 3వ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన వారు తుర్కియే దేశంలోని పర్యాటక సాంస్కృతిక ప్రదేశాలు అక్కడి అవకాశాలు వారు అందించే సహకారం గురించి వెల్లడించారు.