Police Arrest Three Nigerians : డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును విదేశాలకు హవాలా మార్గంలో పంపిస్తున్న గ్యాంగ్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చెక్ పెట్టింది. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12.5 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.