Vontimitta Brahmotsavalu 2025 : ఒంటిమిట్టలోని కోదండరామ ఆలయంలో ఏప్రిల్ 05 నుంచి 15 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11 సీతారాముల కల్యాణ మహోత్సం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ జీవీ అశోక్‌కుమార్ పరిశీలించారు. ఉత్సవాల ఏర్పాట్లు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, చేపట్టాల్సిన పనులపై వారు చర్చించారు.