Tirumala Brahmotsavam Garuda Vahana Seva: తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి అత్యంత విశేషంగా నిర్వహించే గరుడ వాహన సేవ కోసం అధికారులు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశారు. నేటి అర్థరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలను నిషేధించటంతో పాటు, కొండ కింద అలిపిరి వద్ద వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అని ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు.