Organic jaggery : ఆ ప్రాంతంలో కనుచూపుమేర చెరకు తోటలే. రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ చెరకు పండిస్తున్నారు అక్కడి రైతులు. స్వచ్ఛతను పాటిస్తూ నాణ్యమైన బెల్లాన్ని తయారు చేస్తున్నారు. రుచికరంగా ఉండటంతో నిమ్మతొర్లువాడ బెల్లం చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ బెల్లం స్వచ్ఛత గురించి తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాదాల తయారీకి ఇవ్వాలని కోరడంతో రైతులు అంగీకరించారు. ఏటా 20 టన్నులకు పైగా బెల్లాన్ని అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.