19 Maoist Members Surrender To Police : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ మేరకు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి మావోయిస్టులంతా లొంగిపోవాలని, తద్వారా వారికి రావాల్సిన అన్ని ప్రభుత్వ ఫలాలను ఇప్పిస్తామని తెలిపామన్నారు. ఫలితంగానే ఈ రోజు 19 మంది మావోయిస్టు దళ సభ్యులు సరెండర్ అయ్యారని ఎస్పీ తెలిపారు.