Villages Suffering For 20 Years On Bridge issue in Seepudi and Kashipudi : ఒక వంతెన నిర్మిస్తే రెండు గ్రామాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గడంతోపాటు, సమయం కూడా ఆదా అవుతుంది. వంతెన కోసం 20 ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆ గ్రామాల ప్రజలకు మాత్రం వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం అయినా తమ బాధను అర్ధం చేసుకోవాలని కృష్ణా జిల్లా గుడివాడ మండలం సీపూడి, కాశీపూడి గ్రామస్థులు కోరుతున్నారు.