Minister Narayana on Town Planning System Reforms: పురపాలక శాఖలోని టౌన్ ప్లానింగ్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేలా వివిధ సంస్కరణలు అమలుకు నిర్ణయిం తీసుకున్నామన్నారు. సమీక్షలో ఈ సంస్కరణలకు సీఎం ఆమోదాన్ని తెలియచేశారని వెల్లడించారు. 15 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు సంబంధించి లైసెన్సుడు సర్వేయర్లు ప్లాన్ను రుసుము చెల్లించి ఆన్లైన్లో పెడితే అనుమతి వచ్చినట్టే అని స్పష్టం చేశారు. ఈ ప్లాన్లో ఎక్కడ డీవియేషన్లు ఉన్నా సదరు సర్వేయర్ లైసెన్సు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేలా చట్ట సవరణ చేస్తున్నామన్నారు.