People Fear Mining of Uranium Deposits in Forest Area in Kurnool District : 'యురేనియం' పేరు చెబితేనే ఆ గ్రామం వణికిపోతుంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల తవ్వకాలు చేస్తారన్న సమాచారంతో గ్రామస్తులకు కంటిమీద కునుకులేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నారు. యురేనియం వెలికితీతకు అనుమతులు నిలిపివేయకుంటే 'అణు'ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.