Palle Panduga Program in AP: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే 'పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాలు' రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. 4 వేల 500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది.