Vijayawada Flower Market: విజయవాడలోని ఈ పూల మార్కెట్లో దొరకని పువ్వంటూ ఉండదు. వేడుక ఏదైనా పూల కొనుగోలు దారులు ఈ మార్కెట్‌కి రావాల్సిందే. పండగలు, ఉత్సవాలు అయితే వేలాది రూపాయల పూలు ఈ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఈ మార్కెట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలకు పూలు ఎగుమతి చేస్తుంటారు. ఈ మార్కెట్‌కి పూలు బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుంటారు. ఉత్సవాల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లో సైతం వేలాది మంది వచ్చి వారికి కావాల్సిన పూలను కొనుగోలు చేసుకుని తీసుకెళ్తారు. నేడు విజయదశమి కావడంతో ఈ పూల మార్కెట్ కొలుగోలుదారులతో కళకలలాడుతోంది.