Khammam Man Bags Four Govt Jobs : చదివిన చదువుకు సార్థకత ఉండాలన్నా, కన్నవారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నా, ప్రభుత్వ కొలువు సాధించే వరకు విశ్రమించేదే లేదని పట్టుబట్టాడు ఈ యువకుడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాజధానికి పయనమై, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు. ఈ ఖమ్మం యువకుడి ఉద్యోగాల సాధన విజయగాథ తెలుసుకుందాం.