Tammineni Sitaram on Tirupati laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెయ్యిలో కల్తీ లేదని, పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని అన్నారు. సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని విమర్శించారు.