SIT Inquiry Tirumala Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిట్ బృందం సిద్ధమైంది. ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా తాజాగా బృందానికి సహాయ సహకారాలు అందించేందుకు మరో 30 మంది అధికారులను తీసుకున్నారు. దర్యాప్తును పూర్తిగా తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అతిథిగృహాన్ని కేటాయించాల్సిందిగా టీటీడీని కోరారు.