Flood Relief Programmes in Vijayawada :బుడమేరు వరద తాకిడికి అతలాకుతలం అయిన విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు, ఫైరింజన్లు సిబ్బంది రంగంలోకి దిగారు. వీరితో పాటు ఆరోగ్య బృందం ముంపు ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యబారిన పడకుండా సేవలు అందజేస్తున్నారు. మరోవైపు వరద బాధితులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆహారం, పాలు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు.