AP Floods Damage : సోమవారం నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. గణన సమయంలో నివాసితులు వారి గృహాల్లో అందుబాటులో ఉంటే పూర్తి స్ధాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సిద్దం చేసిన బృందాలకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం వేదికగా శనివారం నాడు ఒక రోజు శిక్షణను ఏర్పాటు చేశారు.